28 March, 2026 | 4:12 AM

సాదాబైనామాలకు గ్రీన్‌సిగ్నల్!

28-03-2026 12:57 AM

జీఓ 76 జారీ చేసిన ప్రభుత్వం..

2014జూన్ 2 కట్ ఆఫ్ తేదీగా..

భూ భారతిలో 34 వేల పైచిలుకు దరఖాస్తులు

సాదా బైనామాలు 12,404

మెదక్ జిల్లాలో 376 రెవెన్యూ గ్రామాలు..

మెదక్, మార్చి 27 (విజయక్రాంతి) : సాదాబై నామాలతో భూముల క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రక్రియ నిబంధనలు సవరిస్తూ జీఓ 76 జారీ చేసింది. దీని ప్రకారం భూమి కొనుగోలు చేసిన వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని, విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిటీ అవసరం లేదని స్పష్టం చేసింది.  ప్రభుత్వ నిర్ణయంతో సుదీర్ఘ కాలంగా భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ’ధరణి’ భూ స మస్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కుము డులను తెచ్చిపెట్టింది. ఆర్జీల పరిష్కారం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగిన స్పందనలేకుండా పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో ’ధరణి’ స్థానంలో ప్రవేశపెట్టిన ’భూ భారతి’ ద్వారా సాదాబైనామాల సమ స్యలను పరిష్కరించనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.

భూ భారతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. గత ఏడాది నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామా, అసైన్డ్ భూ ములకు సంబంధించిన వికావడం గమనర్హం. జిల్లా వ్యాప్తంగా 376 రెవెన్యూ గ్రామాలు ఉండగా, సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి లో 34,931 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సాదా బైనామల ద్వారా 12,404 దరఖాస్తులు వచ్చాయి.

సమస్యల పరిష్కారం దిశగా..

ప్రభుత్వం ఆర్వోఆర్-2020-25 భూ భారతి చట్టాన్ని తీసుకవచ్చింది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా బాధితులు దరఖాస్తులు చేసుకున్నా రు. గత ప్రభుత్వం అంతకు ముందున్న రైతులకు భూ హక్కులు కల్పించే పట్టదారు పాసు పుస్తకాల చట్టం - 1971ని రద్దు చేసి కొత్తగా పాసు పుస్తకాల చట్టం -2020 పేరిట ధరణిని తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, కొత్త సమస్యలను తీసుకొచ్చింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ గత ఏప్రిల్ 14న ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో బాగంగా జూన్ 3వ తేదీ నుంచి అన్ని మండలాల్లో ప్రభుత్వం రెవెన్యూ స దస్సులు నిర్వహించి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

 2014 జూన్ 2 కటాఫ్ తేదీగా.. 

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సాదాబై నామా కూడ ఒకటి. గతంలో గ్రామాల్లో చాలా మంది రైతులు రెవెన్యూ స్టాంప్ పేపర్లు, తెల్లకాగితాలపై భూ ముల క్రయవిక్రయాలు జరిపేవారు. ఈ విధానంలో భూములపై హక్కు సంపూర్ణంగా లభించేది కాదు. ఈ విషయమై దృష్టిసారించిన గత ప్రభుత్వం సాదాబైనా మాల సమస్యను పరిష్కరించేందుకు 2016లో జీవో నెంబర్ 153ను తీసుకొచ్చింది. 2014 జూన్ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 12న కూడ జీవో నెంబర్ 112ను జారీ చేసింది. సాదాబైనామాల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా వేసింది. అయినా సమస్యలకు పరిష్కారం లభించ లేదు. ఆ సమస్య పరిష్కారం కాకుండానే 29అక్టోబర్ 2020లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల చట్టాన్ని తెచ్చింది.

ఎన్నిసార్లు జీవోలు తెచ్చినా...పరిష్కారం చూప కపోవడంతో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభు త్వం కేవలం జీవోల జారీతోనే సరిపెట్టిందని, సాదా బైనామాలపై తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చినప్ప టికీ, వాటిని పరిష్కరించేందుకు సరైన మార్గదర్శకాలను విడుదల చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించింది. సాదాబైనామాలతో పాటు అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి కూడా దరఖాస్తులు వచ్చాయి.

ముందుకు సాగు సమయంలో సాదాబైనామాల అంశం హైకోర్టుకు వెళ్లడం, ఈ అంశంపై స్టే విధించింది. ప్ర భుత్వం కూడా ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలోకి వెళ్లింది. వాస్తవానికి ప్రభుత్వం భూ భారతి చట్టంలో సాదాబైనామాల సమస్యను చేర్చినందున హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వస్తుందనే అభిప్రాయాలను దరఖాస్తుదారులు అప్పట్లోనే వ్యక్తపరిచారు. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడినందున ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి సమస్యలకు పరిష్కారం చూపేందుకు సన్నద్దం అవుతోంది.

 నిరీక్షణకు తెర పడేనా..? 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. మెదక్ జిల్లాలో 12, 404 దరఖాస్తులు రాగా,  వీటిని క్రమబద్దికరించేలా ఆర్ ఓ ఆర్ 2020 స్థానంలో  ఆర్ ఓ ఆర్ 2025 భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 6 ద్వారా సాదా బైనామా క్రమ బద్ధికరణకు అవకాశం కల్పించింది.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు సాదా బైనామా ల క్రమ బద్ధికరణకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రైతుల్లో ఏళ్ల నాటి నిరీక్షణకు తెర పడింది. సాదా బైనామా ల క్రమ బద్ధికరించుకోవడం ద్వారా రైతులకు భూ పట్టాలు జారీ అవుతాయని భావించారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు తమకు అందిన దరఖాస్తులను గ్రామాల్లో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడంతో సమస్య తీరుతుందని అనుకున్నారు. కానీ దీనిపై అడుగు ముందుకు పడడం లేదు. 

రైతులకు తప్పని సరిగా భూ హక్కులు కల్పిస్తాం.. 

నిబంధనల ప్రకారం కబ్జాలో ఉండి భూములు కాస్తూ చేస్తున్న అర్హులైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వం. సాదా బైనామా ల క్రమ బద్ధికరణకు ప్రభుత్వం 76 జీఓ ను జారీ చేసింది. మెదక్ జిల్లాలో 376 రెవెన్యూ గ్రామాలు ఉండగా, భూ భారతి లో 34,931దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సాదా బైనామా ల కోసం 12,404 దరఖాస్తులు వచ్చాయి.

- నగేశ్, అదనపు కలెక్టర్