13 July, 2026 | 6:59 PM

ఆర్ఎంపీల సంఘ భవనానికి రూ.10 లక్షలు మంజూరు

13-07-2026 05:51 PM

నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ వెల్లడి

ముకరంపుర,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తొలి వైద్య సేవలు అందించేది ఆర్ఎంపీ లేనని కొనియాడారు.

ఆర్ఎంపీ సంఘం సొంత భవన నిర్మాణానికి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే భవిష్యత్తులో మరో రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సహకారంతో సంఘం అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని నరసింహారావు, ప్రధాన కార్యదర్శి పైడిపల్లి కుమార్ పాల్గొన్నారు.