24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

మాడ్గులలో అభివృద్ధి పండుగ

22-04-2026 04:07 PM

* రూ. 1.05 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కసిరెడ్డి

మాడ్గుల,(విజయక్రాంతి): మాడ్గుల మండలంలో బుధవారం అభివృద్ధి పనుల సందడి నెలకొంది. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మండలంలో కోట్లాది రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలన్నీ అభివృద్ధి తోరణాలతో కళకళలాడాయి.​ మండలంలోని మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆర్కపల్లి ఉన్నత పాఠశాల నుండి పల్గుతాండ వరకు రూ. 1.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ, సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తండాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, మాడ్గుల గ్రామాలలో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్మించిన అత్యాధునిక ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను కూడా ఆయన ప్రారంభించారు. పేదలకు ఆత్మగౌరవంతో కూడిన గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

* ​214 మందికి కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

​మధ్యాహ్నం మాడ్గుల వాసవీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఆడబిడ్డ పెళ్లి పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందజేస్తోందని ఆయన వివరించారు.నా లక్ష్యం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి. మండలంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా, మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూస్తాం అని ఎమ్మెల్యే హామీచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగన్ గౌడ్, యాట గీత, నర్సింహ, రమేష్ గౌడ్, దళపతి, నరేంద్ర రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, బాబా, వేణుగోపాల్ రెడ్డి తదితరులతో పాటు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు మరియు మండల ప్రజలు పాల్గొన్నారు.