12 May, 2026 | 11:46 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులకు పెద్దపీట వేసిన మీరు... మోదీని విమర్శిస్తారా?

22-04-2026 04:03 PM

ఖబర్దార్ కాంగ్రెస్

ఖర్గే చిత్రపటం దహనం

తాండూరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూర్ లో బుధవారం అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి నాయకులు ఖర్గే చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, తాండూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం,  సీనియర్ నాయకులు బాలి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ... దేశానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని.. బిజెపి పార్టీని ఎదుర్కోలేక ప్రధానిపై  ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని... దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాని మోదీని దూషిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని నాలుగవసారి కూడా మోడీని గెలిపిస్తారని అన్నారు.  సమాధానం ఇస్తారని అన్నారు. దేశ ప్రధాని మోడీని ఉగ్రవాదులతో పోల్చడం దేశద్రోహానికి సమానం అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులకు పెద్దపీట వేసిన మీరు..ప్రధానిని విమర్శిస్తారా? ఖబర్దార్ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.