31 August, 2026 | 2:41 PM

ఆలయ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ

31-08-2026 02:10 PM

ఇచ్చోడ, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పట్వారిగూడలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 26 లక్షలు మంజూరు కాగా సోమ వారం ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో రూ. 8 లక్షలతో చేపట్టబోయే సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయన్ మహారాజ్ మాదాపూర్ కర్, బీజేపీ మండల అధ్యక్షులు రమేష్ టేహారే, నాయకులు సుభాష్ పాటిల్ హరన్, స్థానిక సర్పంచ్ పెందుర్ కేశవ్, బాలాజీ దహాలే, కసల్ చంద్ మహమూద్, మురాద్, గ్రామ పటేల్, దేవారి, మహాజన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.