31 August, 2026 | 3:41 PM

ఊకె శిరీష మృతిపై సమగ్ర విచారణ జరపాలి

31-08-2026 02:36 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కల్లపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి ఊకె శిరీష మృతి సాధారణ ఘటన కాదని, పకడ్బందీ ప్రణాళికతో హత్య చేసినట్లు అనుమానాలు ఉన్నందున సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ కజిల్లా కార్యదర్శి దుర్గం రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శిరీషకు ఆసుపత్రి యాజమాన్యం సరైన రక్షణ కల్పించకపోవడం బాధాకరమన్నారు.

మహిళా సిబ్బంది భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలని, నిందితుడిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, కోశాధికారి దుర్గం నిఖిల్, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపెల్లి రాజేశ్వర్, సుంకె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.