12 March, 2026 | 11:06 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పెద్ద పల్లి జిల్లాకు బయలుదేరిన గ్రూప్ 4 విద్యార్థులు

04-12-2024 02:01 PM

వనపర్తి,(విజయక్రాంతి): గ్రూప్-4 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నియామక పత్రాలు అందుకునేందుకు పెద్దపల్లి జిల్లాకు బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి డిఆర్డిఓ ఉమాదేవి, ఏవో భాను ప్రకాష్ లు 179 మంది అభ్యర్థులను నాలుగు ప్రత్యేక బస్సుల్లో జెండా ఊపి  సాగనంపారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.  వనపర్తి జిల్లా నుండి మొత్తం నాలుగు బస్సుల్లో 179 మంది ఎంపికైన అభ్యర్థులు పెద్దపల్లికు బయలుదేరారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.