మున్సిపల్ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది
డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో ఖానాపూర్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని, ఈనెల 24న జరిగే మున్సిపల్ సాధారణ సమావేశంలో ఖానాపూర్ ప్రధాన రహదారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, కౌన్సిలర్ నిమ్మల రమేష్ అన్నారు. గత వారం రోజులుగా ఖానాపూర్ పట్టణ ప్రదాన రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ యువత ప్లెక్సీలు, ఆందోళన కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం విశ్రాంతి భవనంలో పట్టణవాసులు, నిరసనకారులు సమావేశం ఏర్పాటు. చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తాము అభివృద్ధిలో భాగంగా 10 నుంచి 20 లక్షలు నిధులు కేటాయించడానికి తీర్మానాన్ని ప్రవేశపెడితే పూర్తి మద్దతు ఇస్తామని చైర్మన్, వైస్ చైర్మన్ లు దీనిని ప్రతిపాదించాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణవాసులు పలువురు పాల్గొన్నారు.






