పిడుగుపాటుకు ఆరు మేకలు, ఐదు గొర్రెలు మృతి
22-06-2026 03:48 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడి చౌటుపల్లి మల్లేష్ అనే వ్యక్తికి చెందిన ఆరు మేకలు, ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులు మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మేత కోసం సత్తెనపల్లి గ్రామం నుంచి పక్కనే ఉన్న అడవి సారంగాపూర్ అడవిలోనికి జీవాలను తీసుకొని వెళ్లగా వర్షానికి పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. తన జీవాధారమైన మేకలు మరణించడంతో ఆర్థికంగా నష్టపోయామని అధికారులు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.






