రఫ్పాడించిన గుజరాత్
చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
బ్యాటింగ్‌లో హైదరాబాద్ ఫ్లాప్ షో
టాప్ ప్లేస్‌కు టైటాన్స్
ఐపీఎల్ లో టైటిల్ ఫేవరెట్ సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్... ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్‌లో అదరగొట్టినా బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. పూర్తి ఫ్లాట్ వికెట్ కాకపోవడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.
అహ్మదాబాద్, మే 12 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హోంగ్రౌండ్ లో దూకుడుగా ఆడే అలవాటున్న గుజరాత్ టైటాన్స్‌ను సన్ రైజర్స్ బౌలర్లు కంగారెత్తించారు. దీంతో ఆ జట్టు 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
గిల్ (5), బట్లర్ (7) లను యువ పేసర్ ప్రఫుల్ హింగే త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో సాయి సుదర్శన్ , నిశాంత్ సింధు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. నిశాంత్ (22) ఔటైన తర్వాత సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ స్కోర్ పెంచారు. నాలుగో వికెట్ కు 60 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ దూకుడు పెంచాడు.
32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ జోరుతోనే గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేయగలిగింది. హోల్డర్ 11 నాటౌట్, తెవాటియా 4 నాటౌట్ గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కమిన్స్ 20 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 169 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై చెలరేగిపోయారు.
ముఖ్యంగా రబాడ అద్భుతమైన పేస్‌తో దుమ్మురేపాడు. హెడ్‌ను సిరాజ్ డకౌట్ గా పెవిలియన్‌కు పంపిస్తే.. రబాడ వరుస ఓవర్లలో అభిషేక్ శర్మ(6) , ఇషాన్ కిషన్ (11) , స్మరన్ రవిచంద్రన్(9)లను ఔట్ చేశాడు. పవర్ ప్లేలోనే హైదరాబాద్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ , అరోరా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్ క్రీజులో ఉండడంతో అభిమానులు ఆశలు వదులుకోలేదు.
అయితే క్లాసెన్ (16)ను హోల్డర్ పెవిలియన్‌కు పంపా డు. నితీశ్ రెడ్డి కూడా ఔటవడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖా యమైపోయింది. తర్వాత టె యిలెండర్లను ఔట్ చేసేందు కు గుజరాత్‌కు ఎంతో సమ యం పట్టలేదు. సన్‌రైజర్స్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. రబా డ 3 , హోల్డర్ 3 , ప్రసి ద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. సన్‌రై జర్స్ కు ఇదే అత్యల్ప స్కోరు.






