కల్మలచెరువులో ప్రత్యక్షమైన జాతీయ పక్షి నెమలి
* అధికారులకు అప్పగింత
గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాంరెడ్డి ఇంటి వద్ద జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. నెమలిని గుర్తించిన వెంటనే ఎలాంటి ప్రమాదం జరగకుండా సీతారాంరెడ్డి అప్రమత్తమై తన ఇంటి వద్ద అటవీశాఖ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌కు సురక్షితంగా నెమలిని అప్పగించారు.
ఈ సందర్భంగా సీతారాంరెడ్డి మాట్లాడుతూ జాతీయ పక్షిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వన్యప్రాణులకు హాని కలిగించకుండా అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.నెమలిని సురక్షితంగా అధికారులకు అప్పగించడం ద్వారా స్థానికులు బాధ్యతాయుత వైఖరిని చాటుకున్నారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మీసాల యోహాను, బొల్లగాని సైదులు, అనిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






