30 June, 2026 | 10:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పూజ తల్లి నుంచి తుపాకీ రికవరీ..

21-07-2024 01:24 AM

‘ఫ్రాడ్ ఐఏఎస్’ అంటూ పూజ మీద విరుచుకుపడుతున్న నెటిజన్లు

తుపాకీతో రైతులను బెదిరించిన పూజ తల్లి మనోరమ

పుణె, జూలై 20: వివాదాస్పద ట్రైయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తల్లి నుంచి పుణె పోలీసులు తుపాకీని రికవరీ చేసుకున్నారు. ఆమె తుపాకీతో కొంత మంది రైతులను బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలకు దిగారు. ఈ కేసులో మనోరమ భర్త, పూజ తండ్రి ది లీప్ ఖేద్కర్‌కు జూలై 25 వరకు కోర్టు మధ్య ంతర బెయిల్ మంజూరు చేసింది. హత్యాయత్నం, బెదిరింపులు, ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మ నోరమ, దిలీప్‌తో పాటు మొత్తం ఐదుగురి మీద కేసు నమోదైంది. పూజ తల్లిని శని వారం పోలీసులు కోర్టులో హాజరుపరి చా రు. మనోరమ ఇంటి నుంచి తుపాకీని స్వాధీ నం చేసుకున్నట్లు పుణె రూరల్ పోలీస్ సూ పరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. తుపాకీతో పాటు మూడు లైవ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.