గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు
29-07-2026 04:24 PM
చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గురు పౌర్ణమి సందర్బంగా స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు.అలాగే సాదు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు షిర్డీ మల్లేశం, ఉపాధ్యక్షులు పిట్టల బాబు, కార్యదర్శి ఉలిసే గిరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆవిర్నెని సతీష్, సర్పంచ్ పులిసత్యం, ఆలయ అర్చకులు రాజూరి జనార్దన్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్,సాధుసజ్జన భజన మండలి రాజూరి రాజయ్య, మెడిశెట్టి రాజు, పోతరాజు రవి,పులి నారాయణ,లింగాల మల్లయ్య, నాగుల శంకర్, మెంగని రాజేశం, భక్తులు పాల్గొన్నారు.






