23 March, 2026 | 3:52 PM

Breaking News

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్   •   భట్టి మాటలకు అర్థాలే వేరులే   •   ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక   •   శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం   •   ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •  

కారుణ్య నియామక ఉత్తర్వులు అందించిన జియం

19-03-2025 07:12 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా నుంచి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్, డెత్  కార్మికుల వారసులకి బుధవారం జియం కార్యాలయంలో ఏరియా జియం వి.క్రిష్ణయ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణిలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అలాగే భూగర్భగనుల్లో పనిచేస్తే నైపుణ్యత పెరుగుతుందని, పని ప్రదేశంలో ఎల్లప్పుడూ రక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులు తెలిపిన, రక్షణ సూత్రాలు నిత్యం పాటిస్తూ సంస్థ పురోగ అభివృద్దికి తోడ్పడాలన్నారు.

ఉద్యోగంలో చేరిన యువత ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని ఉన్నత స్థనాలకు ఎదగాలన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు వారసత్వంగా అందించిన తల్లిదండ్రులను, కుటుంబాన్ని పోషించాలని అన్నారు. రామగుండం-1 ఏరియా భూగర్భ గనిలో, ఇల్లందు ఏరియాలో పనిచేయుటకు నియామక ఉత్తర్వులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఓ.టు జీ.యం రామస్వామి, డిజిఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, ఫైనాన్స్ మేనేజర్ మధుబాబు సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు గుర్తింపు సంఘం నుండి కోడెం సుందర్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.