24-04-2025 01:40:56 AM
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): తీవ్ర కాలేయ వ్యాధి బారిన పడిన సింగరేణి కార్మికులకు 50 శాతం వేతనంతోపాటు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్ప టి వరకు ఈ వెసులుబాటును ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. గుండె జబ్బు, క్షయ, క్యాన్స ర్, కుష్టు, పక్షవాతం, మూత్రకోశ, ఎయిడ్స్, మెదడు వ్యాధులకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు. ఇటీవల కోలిండి యా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ బాధితులకు ప్రత్యేక సెలవు వర్తిం పజేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది.