calender_icon.png 10 May, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు పట్టించుకోబడం లేదు :- మాజీ మేయర్

24-04-2025 01:38:26 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్23: స్మార్ట్ సిటీ అవినీతిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని... మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయున మీడియాతో మాట్లాడారు. ఐదు నెలల క్రితం స్మార్ట్ సిటీ అవినీతిపై మున్సిపల్ కమిషనర్, ఎస్‌ఈ, టీఎంసీలపై ఫిర్యాదు చేశానని చెప్పారు.

గ్రామ పంచాయితీలకు నిధులు మళ్లించడమేంటని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్టేడియంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులు ఆడుకునే హక్కు లేదా అని అడిగారు. ఆ సమ్మర్ క్యాంప్ కు గతంలో లక్షలు వెచ్చించి... కోడి  గ్రుడ్డు, అరటిపండు, పాలు అందించామని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా నగర కూఢళ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. డివిజన్లు మారుస్తున్నామంటూ... అధికారులు హడావుడి చేస్తున్నారని... నోటిఫికేషన్ రాకముందే ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.