calender_icon.png 10 May, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గ్యారెంటీ’పై మిల్లర్ల ఆందోళన!

24-04-2025 01:41:22 AM

  1. సీఎంఆర్ విషయంలో అయోమయం 
  2. ప్రభుత్వ కొత్త పాలసీపై నిరసన బాట

-కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో అయోమయ పరిస్థితుల్లో రైస్ మిల్లర్ల వ్యవస్థ ఉంది.  బ్యాంకు గ్యారెంటీ విషయంలో గందరగోళం నెలకొంది. ఇదే విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో  మిల్లర్లు రాస్తారోకో నిర్వహించగా, వివిధ చోట్ల ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

సిరిసిల్లలో ధాన్యంను మిల్లులకు కాకుండా గోదాములకు తరలిస్తున్నారు.బ్యాంక్ గ్యారెంటీ లింకు పెడుతూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు ధాన్యం కేటాయింపు, సీఎంఆ్ప సంచలన నిర్ణయాలను వెల్లడించింది.  మిల్లర్లను మూడు క్యాటగిరీలుగా విభజించి, వారు సీఎంఆర్ ఇచ్చిన విధానాన్ని బట్టి గ్యారెంటీలను నిర్ణయించింది. 

కొత్త పాలసీ ఇలా..

గత పదేళ్లుగా పౌరసరఫరాల శాఖ ధాన్యం సీఎంఆర్  బకాయి లేనటువంటి వారికి ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా ధాన్యం కేటాయించేది. ప్రస్తుతం వీరు కూడా ౧౦ శాతం బాంక్ గ్యారెంటీ రూపకంగా చెల్లించాలని నిబంధన విధించారు. సుమారు ఒక పారబాయిల్ రైస్ మిల్లర్లు 400 టక్కుల ధాన్యం తీసుకుంటే.. సుమారుగా రూ.8 కోట్ల విలువైన సరుకు వస్తుంది.

దీనికి సరిపడా అంటే సుమారు రూ.౧.16 కోట్ల నుంచి రూ.౧.౨౦ కోట్ల వరకు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ రూపకంగా ఇవ్వాలి. అప్పుడే వారికి ప్రభుత్వం ధాన్యం కేటాయించేలా జీవో విడుదల చేసింది. అయితే దీనివల్ల పెద్ద ఇండస్ట్రీ ఉన్నవారికి సమస్య లేదు.. చిన్న చిన్న పారాబాయిల్ రైస్ మిల్లుల వారు, 300 నుంచి 4౦౦ లారీల ధాన్యం సేకరించి ప్రభుత్వానికి చెల్లించేవారు ప్రస్తుతం బ్యాంకు గ్యారెంటీ ఎలా ఇవ్వాలో తెలియక సందిగ్ధంలో మునిగిపోయారు.

పదేళ్లుగా కస్టం మిల్లింగ్ చార్జీలు లేవు

గత పదేళ్లుగా పౌరసరఫరాల శాఖ ద్వారా రావాల్సిన  కస్టంమిల్లింగ్ చార్జీలు, రవాణా చార్జీలు గాని మిల్లర్లకు చెల్లించలేదు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 220 మిల్లులకి.. ఒక్కో మిల్లుకి కోటి రూపాయలు తగ్గకుండా బకాయిలు రావాల్సి ఉందని తెలిసింది. మళ్లీ బ్యాంకు గ్యారెంటీ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే.. ఆ డబ్బులు వస్తాయా? రావా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులు మిల్లర్లకు అర్థమయ్యేలా వివరిస్తే  వారు సిద్ధమయ్యే వారని చర్చ సైతం జరుగుతుంది.