కెస్లాపూర్ వీరాంజనేయ ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
12-05-2026 02:28 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కెస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష శర్మ, అర్చకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజలు నిర్వహించి అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.






