23 August, 2026 | 6:55 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

హ్యాపీ బర్త్డే

13-01-2025 12:00 AM

సాయాజీ షిండే బర్త్‌డే ఈరోజు. 1959, జనవరి 13న మహారాష్ట్రలోని సతారా జిల్లా సఖర్‌వాడి అనే చిన్న గ్రామంలో పుట్టారు. 1978లో ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ నీటిపారుదల శాఖలో కొద్దిపాటి జీతంతో కాలేజీలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ అభిరుచే ఆయన్ను ముంబై చేర్చింది. మరాఠీలో ఏకపాత్రాభినయంతో నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన వివిధ భాషల ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.

తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో నాటకాలు, సినిమాల్లో నటించారు. ‘అబోలి’ చిత్రంలో తొలిసారి ‘సాయాజీ’ అనే పాత్రలో నటించారు. ఆ పాత్రకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఎన్నో సినిమాలతో ప్రేక్షకాదరణ పొందారు సాయాజీ షిండే.