23 August, 2026 | 7:02 PM

Breaking News

యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ సన్నాహక సమావేశం   •   ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠలో ఎమ్మెల్యే విజయరమణ రావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •  

మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం

23-08-2026 06:18 PM

బాన్సువాడ, ఆగస్టు 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన యువకుడు మంద శ్రీకాంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లంపేట్ గ్రామ పెద్దలు, నాయకులు స్పందించి శ్రీకాంత్ కుటుంబానికి ఆదివారం ఆర్థిక సహాయం అందించారు. మల్లంపేట్ గ్రామానికి చెందిన నాయకులు, ఆర్కల అనంతస్వామి ముదిరాజ్ (మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్) ఆధ్వర్యంలో ఆయన స్నేహబృందం కలిసి శ్రీకాంత్ తల్లి మంద విటవ్వకు రూ.50,000 చెక్కును అందజేశారు. శ్రీకాంత్ మిత్రుడు పూజం జీవన్ మాట్లాడుతూ.. తన మిత్రుడి పరిస్థితిని తెలుసుకుని తాను సహాయం కోరిన వెంటనే స్పందించి, ఎలాంటి సంకోచం లేకుండా పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన మల్లంపేట్ గ్రామపెద్దలు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో అందించిన సహాయాన్ని తాము ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు.