23 August, 2026 | 7:40 PM

నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు

23-08-2026 06:51 PM

తుది శ్వాస వరకు ప్రజా పోరాటాలకు అంకితం - పోటు సూర్యం

వెలిదండ గ్రామంలో ఘనంగా సంతాప సభ

గరిడేపల్లి, ఆగస్టు 23, (విజయ క్రాంతి): తుది శ్వాస వరకు నమ్ముకున్న ఎర్ర జెండా కోసం, పేద ప్రజల, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని ప్రజా పోరాటాలకు అంకితమైన కామళ్ళ నవీన్ మృతి ఈ ప్రాంత కార్మిక లోకానికి తీరనిలోటని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం అన్నారు. ఐఎఫ్‌టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్ అంత్యక్రియలు ఆదివారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో అశ్రునయనాల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న వయసు నుంచే విప్లవ రాజకీయాలను స్వీకరించిన నవీన్ దేశంలోని పీడిత ప్రజల విముక్తి కోసం తన పోరాటాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించారని అన్నారు. 

అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మదన్న, బండారి ఐలయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు, మండారి డేవిడ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. జనార్ధన్, పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్, గంటా నాగయ్య, పోటు లక్ష్మయ్య,పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.