ముత్యం లాంటిదీ హరికథ
మ్యాగీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘హరికథ’. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనికరెడ్డి, అర్జున్ అంబ టి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషాశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిస్నీఫ్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. “సముద్రం నుంచి ముత్యాలు దక్కించుకున్నట్లు మంచి స్క్రిప్ట్స్, ప్రాజెక్ట్స్‌ను పీపుల్ మీడియా, హాట్‌స్టార్ అందుకుంటాయి. ‘హరికథ’ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది” అన్నారు. “ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ ‘హరికథ’ రూపంలో నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సిరీస్‌లో నేను హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో కనిపిస్తా” అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సిరీస్ బృందంతోపాటు సురభి నాటక కళా సంస్థ ప్రతిని ధులు పాల్గొన్నారు.






