అలాంటి ప్రేమ మరెక్కడా దొరకలే
సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలు, జీవితానికి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సమంత తన పెంపుడు శునకం సాషాతో తీసుకున్న ఫోటోను షేర్ చేసి.. ప్రేమను గురించి ఓ పోస్ట్ పెట్టారు. “సాషా చూపించే ప్రేమ ఇప్పటి వరకూ మరెక్కడా దొరకలేదు” అంటూ సమంత క్యాప్షన్ పెట్టారు. అలాగే ఈ ఏడాది ఎలా గడిచిందో తెలియజేస్తూ ఒక సందేశాత్మక పోస్టును సైతం పెట్టారు. “ఈ ఏడాది ముగియనున్న తరుణంలో ఇప్పటి వరకూ జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను తెలుసుకుందాం. సవాళ్ల నడుమ ఎన్నో సాధిస్తూ ఒక నటిగా ఇక్కడి వరకూ వచ్చాను. ఈ ఏడాది అందరినీ పరీక్షించింది. మనకు ధైర్యం, పట్టుదల, విశిష్టత అన్నీ నేర్పించింది” అని పేర్కొన్నారు. ఇటీవలే సమంత తన తండ్రి జోసెఫ్ ప్రభును కోల్పోయారు. ప్రస్తుతం ఆమె సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సమంత ’రక్త్‌బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్‌డమ్’ కోసం పని వర్క్ చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌లోకి అడుగు పెట్టారు.






