14 July, 2026 | 12:02 PM

తప్పు చేశా.. ఇబ్బంది పడుతున్నా

10-12-2024 12:00 AM

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడిప్పుడే తనకు అయిన గాయం నుంచి కోలుకుంటున్నారు. దాదాపు రెండు నెలల క్రితం జిమ్‌లో 80 కేజీల బరువు ఎత్తే క్రమంలో రకుల్ గాయపడ్డారు. ఆమెకు వైద్యులు బెడ్ రెస్ట్ చెప్పారు. తాజాగా రకుల్ తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని వెల్లడించారు. ఇన్‌స్టా వేదికగా రకుల్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది తాను నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెన్ను గాయం మానడానికి సమయం పడుతుందన్నారు. శరీరం మాట వినాలని.. పరిమితిని మించి వర్క్ చేసి దానిని ఇబ్బంది పెట్టవద్దన్నారు. తాను అదే తప్పు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానన్నారు. వెన్ను గాయం రెండు వారాల్లో తగ్గిపోతుందని అనుకున్నానని.. ఎనిమిది వారాలు అయిందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటానని రకుల్ వెల్లడించారు.