12 March, 2026 | 9:23 AM

మహేశ్ ఫ్యాన్స్‌కు హరీశ్ సారీ!

12-03-2026 12:19 AM

డైరెక్టర్ హరీశ్‌శంకర్ మహేశ్‌బాబు అభిమానులకు సారీ చెప్పా రు. ఓ నెటిజన్ మహేశ్‌బాబు కా ర్డుల గురించి, ఆయన రానున్న చిత్రంపై నెగెటివ్ పోస్ట్ పెట్టారు. దానికి హరీశ్ శంకర్ రిప్లై పెట్టారు. దీంతో నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. వెంటనే పోస్టు డిలీట్ చేసినప్పటికీ అది అప్పటికే వైరల్ కావడంతో ఆయన మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెపుతూ లేఖ విడుదల చేశారు.

కొన్ని రోజులుగా పని ఒత్తిడి, సెన్సార్ పనులు, అనంతరం బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్స్ ప్రో మో ఫైనల్ చెక్ చేయడం.. ఇలా ఎం తో బిజీగా ఉన్నందున ఆ అభిమాని పోస్ట్ పూర్తిగా చదవడకుం డా రిప్లై ఇచ్చినట్లు చెప్పారు.

ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఈ నెల 19వ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలు పుతూ సోషల్ మీడియాలో రిప్లైలు ఇస్తున్నా ను. ఆ హడావిడిలో ఒక పోస్టు పూర్తిగా చదవకుండానే కోట్ చేశా. వెంటనే నా టీమ్ అప్ర మత్తం చేయడంతో పొరపాటును గ్రహించి నిమిషం వ్యవధిలోనే రిప్లై తొలగించాను. ‘సూపర్ స్టార్ మహేశ్‌బాబు అంటే నాకు ఎంతో గౌరవం.

‘వారణాసి’ చిత్రంతో ఆయన మరె న్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నా. ప్యా న్స్ మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు’ అని తన లేఖలో హరీశ్ రాసుకొచ్చారు. ఒక సినిమా విజయవంతం కావాలం టే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరమని. సినిమా విడుదలకు కేవలం 30 రోజుల సమయం ఉన్నప్పుడు అలాంటి వివాదాలకు తావిచ్చేంత అవివేకిని కాదని ఆయన అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుపై క్షమాపణలు కోరుతున్నానని, అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.