ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు
ఆదర్శంగా నిలిచిన విశ్వనాథపల్లి సర్పంచ్ రాజు
ఖమ్మం జిల్లా విశ్వనాథపల్లి సర్పంచ్ ఇస్లావత్ రాజు తన కూతురిని ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని చాటారు. బడిబాట కార్యక్రమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
కారేపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రైవేటు స్కూల్లో చదువుతున్న తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి సర్పంచ్ ఇస్లావత్ రాజు. సర్పంచ్ కూతురు ఇస్లావత్ రవళి ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. విశ్వనాథపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రతీ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఆకర్షితుడైన సర్పంచ్ ప్రభుత్వ పాఠశాల పై ప్రజలకు నమ్మకం కల్పించాలని తన కూతురును ప్రభుత్వ బడిలో చేర్చేందుకు నిర్ణయించుకున్నాడు.విశ్వనాథపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ లో మంగళవారం చేర్పించారు. స్కూల్లో చేరిన రవళికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను హెడ్మాస్టర్ పద్మ అందజేసి ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ రాజును అభినందించారు.
మరిన్ని తెలంగాణ తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్ Telangana News సెక్షన్ చూడండి.
సర్పంచ్ ఎందుకు తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించారు?
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు, బడిబాట కార్యక్రమానికి మద్దతుగా విశ్వనాథపల్లి సర్పంచ్ ఇస్లావత్ రాజు తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
విద్య, పాఠశాలలు, ఉద్యోగాల తాజా అప్‌డేట్స్ కోసం Education News సెక్షన్‌ను సందర్శించండి.
FAQ's
Q1. ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లిలో జరిగింది.
Q2. సర్పంచ్ పేరు ఏమిటి?
ఇస్లావత్ రాజు.
Q3. ఏ కార్యక్రమం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు?
ప్రభుత్వ బడిబాట కార్యక్రమం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Q4. విద్యార్థిని పేరు ఏమిటి?
ఇస్లావత్ రవళి.
Q5. ఈ నిర్ణయానికి ప్రజల స్పందన ఎలా ఉంది?
ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచే ఆదర్శ నిర్ణయంగా ప్రశంసలు లభిస్తున్నాయి.






