23 June, 2026 | 1:41 PM

కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

23-06-2026 12:36 PM

ఖట్టర్ నివాసంలో కీలక భేటీ.. సంయుక్తంగా భేటీ అయిన రేవంత్, కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటనను కొనసాగిస్తున్నారుమంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో(Union Minister Manohar Lal Khattar) సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(Indian Railway Finance Corporation) నుంచి రుణం, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు.

ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌(Union Railway Minister Ashwini Vaishnaw) కూడా పాల్గొన్నారు. హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ తో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో పాటు అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. సమావేశం అనంత‌రం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైల్వే మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయ‌ని వెల్లడించారు.