25 February, 2026 | 4:44 AM

కన్నబిడ్డపై కర్కశత్వం

25-02-2026 01:29 AM
  1. సజీవ దహనం చేసిన కిరాతక తల్లి
  2. మేడ్చల్ జిల్లాలో ఘటన

కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కన్నబిడ్డను తల్లి సజీవదహనం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర, మమతలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండు నెలల కొడుకు ఉన్నాడు. జీవనోపాధి నిమ్మిత్తం బౌరంపేట్ ఓఆర్‌ఆర్ సమీపంలోని సనరెల్లి అపార్ట్మెంట్‌లోని కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే రెండు నెలల చిన్నారి రోజూ ఏడుస్తూ, ఇబ్బంది పెడుతున్నాడని మంగళవారం చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లను తాడుతో కట్టి కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.