31 July, 2026 | 4:23 PM

సుబ్లేడు పెద్ద బోడబండ వద్ద రోడ్డు ప్రమాదం..

31-07-2026 03:47 PM

అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామ పెద్ద బోడబండ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాతర్లపాడు గ్రామం నుంచి హస్నాబాద్ గ్రామానికి సిమెంట్ లోడ్ కోసం వెళ్తున్న ట్రాక్టర్, సుబ్లేడు నుంచి బంగ్లా వైపు టూ వీలర్‌పై వెళ్తున్న మేడిదపల్లి గ్రామానికి చెందిన భూక్య పవన్ కళ్యాణ్ (28)ను అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ యజమాని అరేకోడు గ్రామానికి చెందిన బాబు కాగా, ట్రాక్టర్ డ్రైవర్ చింతలపాలెం గ్రామానికి చెందిన ఎడ్ల సాయిగా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.