31 July, 2026 | 4:19 PM

సనత్ నగర్ TIMSకు మాజీ సీఎం పేరు

31-07-2026 03:30 PM

సనత్ నగర్ టిమ్స్ కు మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టుతూ, ఇకపై “డా. మర్రి చెన్నారెడ్డి(Marri Chenna Reddy) తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్”గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం, ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన మహానేత డా. మర్రి చెన్నారెడ్డికి ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించిన సముచిత గౌరవం అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ లో పోస్టు చేశారు.