6 April, 2026 | 3:43 AM

వడగండ్ల విధ్వంసం

06-04-2026 02:06 AM

సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు 

కామారెడ్డి/తాడ్వాయి/బిచ్కుంద/కోనరావుపేట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానతో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి డివిజన్ తో పాటు తాడ్వాయి, బిచ్కుంద మండ లాలలో కురిసిన వడగండ్ల వర్షానికి వేలాది ఎకరాల పంట పొలాలు, మొక్కజొన్న, పంటలు నేల కొరిగాయి. రూ.50 లక్షల వరకు పంట నష్టం జరిగినట్లు తెలిసింది. కామారెడ్డి మండలం, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్, రామారెడ్డి, రాజంపే ట, తాడ్వాయి మండలాల్లోని ఆయా గ్రామా ల్లో, తాడువాయి మండలం దేమికలాన్, కతాడ్వాయి, ఎర్రపహాడ్, నందివాడ, చందాపూర్, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, చిట్యాల, ఏండ్రి యాల గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మొక్కజొన్న పంటలు పూర్తిగా నేల కొరికాయి. గోధుమ, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు స్పందిం చి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఆదివారం అకాల వర్షం, భీకర వడగండ్ల వాన రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 90శాతం మంది రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.