ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి
06-04-2026 02:07 AM
కేంద్ర హోంమంత్రికి మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): భద్రాచలం పక్కనున్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో కలపడంతో ఆ గ్రా మాల గిరిజనులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలనా సౌలభ్యం కోసం వీటి ని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని మంత్రి తుమ్మల కేంద్రమంత్రిని కోరారు.




