18 April, 2026 | 10:59 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇలాంటి సీక్వెన్స్ చూడలేదన్నాడు

19-04-2025 12:00 AM

 నందమూరి కల్యాణ్‌రామ్ తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొంటూ చిత్రబృందం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. ‘క్ల్లుమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్.

పొద్దున్నే మా అబ్బాయి సిని మా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పాడు. ఆ రియాక్షన్‌కు నేను షాక్‌కు గురయ్యా. చాలా గర్వంగా ఉంది నాన్న అని చెప్పాడు’ అన్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు శ్రీకాంత్, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, నిర్మాత సునీల్ బలుసు తదితరులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.