25 May, 2026 | 7:05 PM

Breaking News

మహిళా సంఘాలకు మరింత చేయూత   •   ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం   •   ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •  

కొత్తదనం కోరుకునే వాళ్లకోసమే తల

29-01-2025 12:00 AM

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘తల’. అంకిత నాస్కర్ హీరోయిన్‌గా నటించింది. పీ శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాధ రాజశేఖర్ వ్యవహరించారు. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేశ్, ముక్కు అవినాశ్ , విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

హీరో సోహైల్, హీరో అశ్విన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో రాగిన్ మాట్లాడుతూ.. ‘మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. క్లుమైట్ చేంజెస్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డాం. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది’ అన్నారు. నటి ఎస్తేర్ మాట్లాడుతూ.. ‘ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి నాతో నటింపజేశారు. ఈ సినిమా రాగిన్‌కు వండర్‌ఫుల్ డెబ్యూట్.

ఈ సినిమా మా అమ్మతో కలిసి చూస్తా’ అన్నారు. హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు రాదు. నేను బెంగాలీ. ఇది నా ఫస్ట్ సినిమా. ఫిబ్రవరి 14న మా సినిమా వస్తోంది. వైలెంట్ వాలైంటైన్స్ డే’ అన్నారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చెప్పారు.

ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా. అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. అబ్బాయి ఏజ్‌కి సంబంధించిన కథ కావాలి. రెండేళ్లు ఆలోచించి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా. కొత్తదనం కావాలనుకునే వారు ఈ సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.