calender_icon.png 21 February, 2026 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిసెమ్ అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ వారి మిరప పంట రైతు ప్రదర్శన క్షేత్రం

20-02-2026 12:00:00 AM

కన్నాయిగూడెం,ఫిబ్రవరి19(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఎర్రోళ్ల రామయ్య మిరప పంట తోటలో యూనిసేమ్ కంపెనీ వారు యుఎస్‌ఎమ్ రష్మీ ప్లస్ మిరప పంట ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా 160 మందికి పైగా యూనిసెమ్ రష్మీ ప్లస్ మిరప పంటను సందర్శించి ఇప్పుడు ఉన్న వాతావరణనికి తెగుళ్లను తట్టుకొని దగ్గర కాపుతో ఆకర్షనీయమైన కాయ సైజు మరియు రంగు తో ఉండి మంచి దిగుబడి వచ్చే విధంగా ఉందని పంటతోట సందర్శించిన రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముప్పనపల్లి డీలర్ హారిక ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, సతీష్ పాల్గొని రైతులు మంచి దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. మరియు ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, లక్ష్మీపురం వెంకటేష్ మరియు కంపెనీ ప్రతినిధులు సేల్స్ ఆఫీసర్ అనిల్  ఫీల్ ఆఫీసర్ సతీష్ కమలాకర్ దినేష్ పాల్గొన్నారు.