15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యం: జిల్లా ఎస్పీ

22-11-2025 01:49 PM

పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం.

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల  ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే  తెలిపారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు శరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  జిల్లా ఎస్పీ ప్రారంభించి సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్నరు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని,పోలీసులు ఆరోగ్యంగా వున్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని,ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు ఆరోగ్య పరీక్షలకై సమయాన్ని కేటాయించాలన్నారు.

విధి నిర్వహణకై అంకితమైన పోలీసులతో పాటు కుటుంబ సభ్యుల సంక్షేమన్ని.దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈశిబిరాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈశిబిరంలో నేత్ర వైద్యుల బృందం పాల్గొని కంటి ఆరోగ్య పరిశీలన,దృష్టి సమస్యల నిర్ధారణ,అవసరమైన మందులు,సూచనలు అందించారు.రోజువారీ ఒత్తిడి,ఫీల్డ్ పనులు,రాత్రి పూట డ్యూటీ కారణంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయుక్తమని,వైద్యులు పేర్కొన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సీ విజన్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు.  ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు మొగిలి,శ్రీనివాస్ ,రవి,నాగేశ్వరరావు, మధుకర్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్,యాదగిరి, ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది,  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.