22-11-2025 01:47:16 PM
కరపత్రం ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామీజీ
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కరపత్రాన్ని శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామి ఆవిష్కరించారు.డిసెంబర్ 07 ఆదివారం రోజున ఉదయం10 గంటలకు నారాయణపూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద నిర్వహించబడుతుందని తెలిపారు.మహా పడిపూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలని కోరారు. కరపత్ర ఆవిష్కరణలో శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామితో పాటు అయ్యప్ప మాలధారణ స్వాములు,భక్తులు పాల్గొన్నారు.