30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

‘కంచ గచ్చిబౌలి’పై విచారణ ఏప్రిల్ 7కు వాయిదా

04-04-2025 01:00 AM

అప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 3: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలంటూ వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

వాదనలు విన్న ధర్మాసనం.. ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం మరోసారి విచారణ కొనసాగగా.. కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.