బోథ్ లో భారీ వర్షం.. మార్కెట్లో రైతు అతలాకుతలం
04-06-2026 01:48 PM
బోథ్,జూన్4(విజయక్రాంతి): బోథ్ సోనాల మండలాల్లో గురువారం అరగంటసేపు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల మార్కెట్కు జొన్న పంటను తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నుండి పంటలను కాపాడేందుకు రైతులు వర్షంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏది ఏమైనా తొలకరి జల్లులు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి.






