వర్షపాతం అనుగుణంగా రైతులు పంటలు పండించాలి
మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న.
తుంగతుర్తి( విజయక్రాంతి): గొట్టిపర్తి గ్రామంలో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చింతకుంట్లవెంకన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తుంగతుర్తి పాల్గొని రైతులకు ఎల్వినూ వర్ష ప్రభావం గురించి వివరించడం జరిగింది. వర్షపాతం అనుగుణంగా రైతులు సంప్రదాయ పంటలు పండించాలని. మరి ముఖ్యంగా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని. విత్తన సబ్సిడీ ఉద్యాన పంటల పండించుకోవడానికి ప్రభుత్వాలు కల్పించే రాయితీని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ అధికంగా ఉండేటట్లు చూడాలని, వర్ష తీవ్రతకు అనుగుణంగా పంటలు పండించాలని వర్షం వల్ల వచ్చే నీటిని కుంటల్లో చెరువుల్లో నీటిని నిలువలు ఉంచుకోవాలని దాని వల్ల మాత్రమే భూగర్భ జలాలు పెరుగుతాయని. రైతులు ప్రభుత్వం కల్పించే రైతులను సద్వినియం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలు చిలుకల మంజుల సర్పంచ్ . ఉపసర్పంచ్ అన్నేబోయిన శ్రీకాంత్. స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకన్న పశుసంవర్ధక శాఖ. ఫీల్డ్ అసిస్టెంట్ ఈసీ . ఏడిఏ రమేష్ బాబు. పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ హెడ్మాస్టర్. అంగన్వాడి టీచర్ పాల్గొన్నారు.






