15 June, 2026 | 10:20 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కాళేశ్వరంలో భారీ వర్షం

24-02-2026 12:00 AM
  1. నేలకొరిగిన చెట్లు, పంటలకు నష్టం

భక్తులకు తీవ్ర ఇబ్బందులు

కాళేశ్వరం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలం పరిధిలోని కాళేశ్వరం గ్రామంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రామంలోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు చీకటిలో గడపాల్సి వచ్చింది. కొన్ని ఇండ్ల కు రేకులు పూర్తి గా ఎగిరి పోయాయి. వర్ష ప్రభావంతో పత్తి, మిర్చి, మొక్క జొన్న పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ చూసినా పంటలు నీటమునిగి, చెట్లు నేలకొరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే కాళేశ్వరం దర్శనానికి వచ్చిన భక్తులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలయం పరిసర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో పాటు చెదారం చేరి అవస్థలు కలిగించాయి. ఆలయం చుట్టూ చెత్త పేరుకుపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు నష్టం అంచనా వేసి బాధిత రైతులు, ప్రజలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.