31 August, 2026 | 6:37 PM

Breaking News

సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •   మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు   •  

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

26-04-2025 12:00 AM

తడిసిన ధాన్యంతో అన్నదాత అయోమయం 

వెల్దుర్తి, ఏప్రిల్ 25 : వెల్దుర్తి మండలంలో శుక్రవారం  సాయంత్రం కురిసిన ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి  మండలం లోని అన్ని గ్రామాలలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో ఎండబెట్టిన వరి ధాన్యం, కోతకు వచ్చిన వరి పంటకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశా రు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ఎండబెట్టి తీసుకొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.  ఆరు గాలం చేసిన కష్టమంతా తడిసి రోడ్డుపైన పారుతుంటే అన్నదాత ఆక్రందన అంతా ఇంతా కాదు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.