వరుణ బీభత్సం

26-09-2026 | 05:00am
  1. నేపాల్, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్, 
  2. జార్ఖండ్, ఛతీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
  3. ఉప్పొంగుతున్న నదులు
  4. సిక్కింలో, ఓడిశాలో విరిగిపడ్డ కొండచరియలు
  5. నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు
  6. 9 రాష్ట్రాలపై అర్నబ్ ప్రభావం

గ్యాంగ్టక్/భువనేశ్వర్/లక్నో/కాఠ్మాండు/రాంచీ, సెప్టెంబర్ 25: తీవ్ర అల్పపీడనం కారణంగా శుక్రవారం సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్(Jharkhand), ఉత్తరప్రదేశ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఉప్పొంగుతున్న వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. సిక్కింలో, ఓడిశాలో కొండచరియలు విరిగి రహదారులపై పడ్డాయి. రోడ్లు జలమయం అయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంటపొలాలు, ఇళ్లు నీటమునిగాయి. రాకపోకలు నిలిచిపోయి, జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయారు.

ఆయా రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలను మూసివేశారు. ముంపు బాధితులను సహాయక కేంద్రాలకు తరలించారు. అలాగే నేపాల్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అలర్ట్ అయ్యారు. దేశంలో 9 రాష్ట్రాలపై అర్నబ్ తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఒక రోజు క్రితం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశాలోకి ప్రవేశించి, శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలను కురిపిం చింది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 ప్రాంతాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం, నీరు నిలిచిపోవడం, ఇళ్లు దెబ్బతినడం వంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారు 10,000 మందిని 200 సహాయక కేంద్రాలకు తరలించారు.

నబరంగ్‌పూర్, నందాహండి, కోరాపుట్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం(Natural disaster) దక్షిణ ఒడిశాలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే భువనేశ్వర్‌తో సహా పశ్చిమ, తీర ప్రాంతాల జనజీవనాన్ని కూడా ప్రభావితం చేసింది. బాలాసోర్ జిల్లాలోని జలక, బుధబలంగ నదులు, జాజ్పూర్ జిల్లాలోని బైతరణి, కని నదులు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. కంధమాల్ జిల్లాలోని కలింగ ఘాట్ వద్ద, ఖల్లికోటలోని బడా ఘాటి వద్ద, గజపతి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ రైలు సేవలకు అంతరాయం కలిగింది. సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. 

మరిన్ని వార్తలు