Maharashtra Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంబైలో భవనం కూలి 6 మంది మృతి, Red Alert జారీ
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు(Maharashtra Rains) కురుస్తున్నాయి. భోర్ ఘాట్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ముంబయి-పుణె మధ్య రైల్వే సర్వీసులు(Railway services between Mumbai and Pune) నిలిచిపోయాయి. ముంబయి- పుణె రోడ్డు మార్గం, ఖొపోలి- కుస్గావ్ మార్గం టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పుణె నుంచి ముంబయి మార్గంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లించారు. ముంబయిలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది.
Maharashtra Rains కారణంగా ముంబైలో పరిస్థితి తీవ్రంగా మారింది. భారీ వర్షాల వల్ల భవనం కూలి ఆరుగురు మరణించగా, Mumbai-Pune Railway Services నిలిచిపోయాయి. IMD Red Alert జారీ చేయడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంది? ప్రయాణికులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారీ వర్షాలకు ముంబైలో ఆరుగురు మృతి
ముంబైలో మాన్ ఖుర్ద్ ప్రాంతంలో భవనం కూలి ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గోరెగావ్ లోని ఆరేకాలనీ ప్రాంతంలో చెట్టు కొమ్మ పడి యువకుడు మరణించాడు. ముంబయిలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా ముంబయి, థానే, పాల్ఘర్ లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా భారత వాతావరణ శాఖ ముంబయికి రెడ్ అలెర్ట్(Red alert for Mumbai) జారీ చేసింది. మహారాష్ట్రలో ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పావనా నది నీటి మట్టం పెరగడంతో, పింప్రి-చించ్‌వాడ్‌లోని మోర్యా గోసావి గణపతి ఆలయంలోకి నీరు చేరింది.
పుణె-ముంబై రహదారి ట్రాఫిక్‌ను మళ్లింపు
భారీ వర్షాల కారణంగా ఖోపోలి-కుస్‌గావ్ మార్గంలోని(Khopoli-Kusgaon route) పూణే-ముంబై లేన్‌లో టన్నెల్-2 (సురంగం-2) ఎగ్జిట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో సోమవారం తెల్లవారుజామున ట్రాఫిక్‌ను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం ప్రారంభించబడిన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్, సహ్యాద్రి పర్వతాల గుండా వెళ్లే 13 కిలోమీటర్ల బైపాస్. ఇది ప్రయాణ దూరాన్ని 6 కిలోమీటర్లు తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని 25 నుండి 30 నిమిషాలు ఆదా చేస్తుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా, సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Maharashtra State Road Development Corporation) తెలిపింది.
Related Articles:
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వర్ష బీభత్సం.. దెబ్బతిన్న మూడు విమానాలు






