శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి
ఆడపడుచులకు చీరల పంపిణీ, దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయాలు
ధన్వాడలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని కాటారం, జూలై 06(విజయక్రాంతి: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu ) అన్నారు. ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. దేవాలయాలు సమాజంలో ఐకమత్యం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామ ఆడపడుచులకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






