6 July, 2026 | 10:41 AM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు విచారణ

06-07-2026 10:08 AM

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో( Sandhya Theatre stampede case) నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కమిటల్ బాండ్ నేపథ్యంలో నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో ఇద్దరు హాజరు కాకపోవడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ఇవాళ కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరయ్యే అవకాశముంది. అల్లు అర్జున్(Allu Arjun) సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్నారు. మొత్తం 23 మంది నిందితులు హాజరైతేనే తదుపరి విచారణ ఉంటుందని నాంపల్లి కోర్టు గతంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.