కేదార్నాథ్ లో తప్పిన పెన్ ప్రమాదం
24-05-2024 05:57 PM
ఉత్తరాఖండ్: బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. భక్తులు కుర్చున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్ తెలివిగా ఖాళీ స్థలంలో హెలికాఫ్టర్ ను సేఫ్ గా ల్యాండింగ్ చేశాడు. హెలికాప్టర్ లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ల్యాండింగ్ సమయంలో అక్కడ ఉన్న భక్తులు భయంతో పరుగులు తీశారు. పైలట్ హెలికాప్టర్ లోని సాంకేతిక లోపాలను ముందే చెక్ చేసుకొని ఉండాల్సిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేదార్నాథ్ లో గత 11 ఏళ్ల లో 10 ప్రమాదాలు జరిగాయి.






