1 August, 2026 | 11:47 AM

బాలీవుడ్ నటి హత్య కేసు.. సవతి తండ్రికి మరణశిక్ష

24-05-2024 05:25 PM

13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో ముంబై కోర్టు సంచటన తీర్పు వెలువరించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ కు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2011 ఫిబ్రవరి లో ఆస్తి తగాదాల కారణంగా పర్వేజ్ తొలుత లైలా ఖాన్ తల్లి సెలీనాను చంపాడు. అనంతరం లైలాతో పాటు ఆమె నలుగురు తోబుట్టువులను కూడా హతమార్చాడు. అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు మే 9వ తేదీన అతడిని దోషిగా నిర్ధారించింది. లైలా ఖాన్.. రాజేశ్ ఖాన్నా సరసన 'వఫా' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.