కాల్ సెంటర్‌లో నరకం
కొన్ని నెలలుగా ఉద్యోగ శిక్షణ పేరుతో యువతులపై దాష్టీకం
మానసిక, లైంగిక హింసకు పాల్పడిన నిర్వాహకులు
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణం
ముజఫర్‌పూర్ (బీహార్), జూన్ 20: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కాల్‌సెంటర్ పేరుతో కొన్ని నెలలుగా యువతులపై చేస్తున్న దాష్టీకాలు తాజా బయటపడ్డాయి. దాదాపు 150 మంది యువతులు మోసపోయి మానసిక, లైంగిక హింసకు గురైనట్లు తెలిసింది. కాల్ సెంటర్ ఉద్యోగాలు కల్పిస్తామని డీబీఆర్ నెట్‌వర్కింగ్ అనే సంస్థ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ అనేక మంది యువతులను ఆకర్షించింది. శిక్షణ కోసం రూ.20 వేలు చెల్లించాలని షరతు పెట్టింది. ఉజ్వల భవిష్యత్తును ఊహించుకుని ముజఫర్‌పూర్‌కు చేరుకున్న తర్వార ఆ యువతులకు నరకం మొదలవుతుంది.
శిక్షణలో లక్ష్యాలను చేరుకో నప్పుడు మానసిక హింసతో పాటు కొన్నిసార్లు అత్యాచారం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంత మందికి అబార్షన్లు చేసినట్లు బయటపడింది. వాళ్ల బారి నుంచి బయట పడిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యా దు చేయగా ఈ విషయం బయటపడింది. వాళ్ల ఊబిలో చిక్కుకున్న 150 మందిలో తాను ఒకరినని వెల్లడించింది. కంపెనీ కీలక వ్యక్తుల్లో ఒకరైన తిలక్‌కుమార్ సింగ్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని, బలవం తంగా అబార్షన్ బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం తొమ్మిది మంది నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తిలక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ముజఫర్‌పూర్ ఎస్పీ అవదేశ్ దీక్షిత్ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన 8 మంది నిందితులను గాలిస్తున్నట్లు తెలిపారు.






