15 July, 2026 | 6:26 AM

ఏపీలో రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన

21-06-2024 01:50 AM

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్‌కుమార్ 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఏపీలో టీడీపీ ప్రభు త్వం కొలువు దీరిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పలు విభాగాల్లో రిటైర్డ్  ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇటువంటి సిబ్బందిని తొలగించాలని సీఎస్ నీరబ్‌కుమార్ అన్ని శాఖ ల హెచ్‌వోడీలు, కార్యదర్శులను ఆదేశించారు. రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై ఈ నెల 24వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఎవరైనా విశ్రాంత ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పని సరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.